వైసీపీకి లాజిక్‌లతో పవన్ చెక్..!

-

విశాఖ వేదికగా రాజకీయం హాట్ హాట్‌గా సాగుతున్న విషయం తెలిసిందే..మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలంటూ వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలో ఉంటూ కూడా వైసీపీ పోరాటం చేయడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ది లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుందని క్లియర్‌గా అర్ధమవుతుంది. ఇదే క్రమంలో తాజాగా విశాఖ గర్జన పెట్టింది..పేరుకు నాన్ పోలిటికల్ జే‌ఏ‌సి పేరుతో కార్యక్రమం చేసింది గాని..అది పూర్తిగా వైసీపీ కార్యక్రమం అయింది.

ఆ కార్యక్రమానికి ప్రజలని ఎలా తీసుకొచ్చారో కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ వైసీపీ గర్జన విజయవంతం అయిందో లేదో పక్కన పెడితే…వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి అదే రోజు టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో సమావేశం పెట్టుకుని, ఉత్తరాంధ్రని వైసీపీ ఎలా దోచేస్తుందో చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో పవన్..ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమానికి విశాఖకు వచ్చారు.

ఇక పవన్‌కు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు జనసేన శ్రేణులు భారీగా వచ్చారు. ఇదే క్రమంలో గర్జన కార్యక్రమం ముగించుకుని వైసీపీ మంత్రులు రోజా, జోగి రమేష్ ఇతర నాయకులు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ మంత్రులు గర్జన సభలో పవన్‌పై ఎలాంటి విమర్శలు చేశారో తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన శ్రేణులు మంత్రుల కార్లు వస్తున్నప్పుడు నిరసన తెలియజేశారు. అప్పుడే కార్లపై రాళ్ళు, చీపుర్లు విసిరారు.

దీంతో కొందరు జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపారు. జనసేన రౌడీ మూకలు దాడి చేశాయని చెప్పి వైసీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. రాజధాని అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ విశాఖకు వచ్చారని ఫైర్ అయ్యారు. అయితే వైసీపీకి అదిరిపోయే లాజిక్‌లతో పవన్ కౌంటర్ ఇచ్చారు. మొదట పవన్ విశాఖకు వచ్చింది రాజధాని ఇష్యూ గురించి కాదు..ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి.

అదే అంశాన్ని చెప్పారు..అలాగే మంత్రులు అంటే పోలీసు సెక్యూరిటీ ఉంటుంది..అలాంటప్పుడు దాడి ఎలా జరుగుతుందని, లేదా జనసేన శ్రేణుల్లో కొందరు వైసీపీ శ్రేణులు దారి దాడి చేసి, కోడి కత్తి తరహాలో డ్రామా క్రియేట్ చేసి ఉంటారని పవన్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు నేరస్తులకు కొమ్ము కాస్తు, ప్రజల కోసం పోరాడేవారి గొంతు నోక్కెస్తున్నారని అన్నారు. కడుపు కాలిన వాడు పోరాటం చేస్తాడని, అధికారంలో ఉండి వైసీపీ గర్జించడం ఏంటి అని నిలదీశారు.

అలాగే తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని..అధికార వికేంద్రీకరణ కాదు..అభివృద్ధి జరగాలని, అసలు పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీలకు అధికారాలు ఇవ్వకుండా..అధికార వికేంద్రీకరణ అని పోరాటం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇక తమ నేతల అరెస్టులని ఖండించి వారి కోసం న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. మొత్తానికి పవన్..వైసీపీకి అదిరిపోయే లాజిక్‌లతో సమాధానం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version