IPL 2023 : ధోనికి బిగ్ షాక్..CSKకు కొత్త కెప్టెన్ !

-

IPL 2023 : మహేంద్ర సింగ్‌ ధోనికి బిగ్ షాక్. CSKకు కొత్త కెప్టెన్ రానున్నాడట. అవును. ఇది నిజమే. CSK తదుపరి కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ లోనే రుతురాజు చెన్నై పగ్గాలు అందుకుంటాడు. ప్రస్తుత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చివరి దశలో ఉండటంతో చెన్నై కొత్త సారధి ఎంపికపై ఫోకస్ పెట్టింది.

ఐపీఎల్ 2023 సీజన్ తో ధోని ఆటకు పూర్తిస్థాయిలో వీడ్కోలు పలకనున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో ఒంటిచేత్తో జట్టుకు టైటిల్ అందించిన రుతురాజ్ గైక్వాడ్ ను సిఎస్కే తదుపరి కెప్టెన్ గా ఎంపిక చేయాలని ఆ టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 లో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్, ఐపిఎల్ 2022లో మాత్రం విఫలమయ్యాడు. అయితే దేశవాలి క్రికెటర్ లో అతను నిలకడగా రాణించాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ తో పాటు, శుక్రవారం ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version