ఏ పని చేయకుండా రూ.3కోట్ల జీతం ఇస్తున్నారని కంపెనీపైనే కేసు వేసిన ఉద్యోగి..!!

-

ఏ ఉద్యోగంలో అయినా.. ఇచ్చే జీతం బట్టి పెట్టే టార్చర్‌ ఉంటుంది. జీతం పెరిగే కొద్ది పని ఎక్కువ అవుతుంది. ఎవరూ కుర్చోబెట్టి శాలరీ ఇవ్వరు కదా.. వీలనైంత వాడుకుంటారు. కానీ ఆ ఉద్యోగం మాత్రం కుర్చోపెట్టి కోట్ల రూపాయల శాలరీ కూడా ఇస్తున్నారట.. ఇంకేంది హ్యాపీగా ఉండొచ్చు కదా.. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏ పని చేయకుండా మూడు కోట్ల రూపాయల జీతం ఇస్తున్నారని కంపెనీ పైనే కేసు పెట్టారట.. ! విచిత్రంగా ఉంది కదూ…వీడికెమైనా మెంటలా..? అలాంటి ఛాన్స్‌ నాకు వస్తేనా అనుకుంటున్నార..? ఇంతకీ మనోడు ఎందుకు కేసు పెట్టారు.. ఆ జాబ్‌ ఏంటో చూద్దామా..!
ఐర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆఫీసులో ఏ పని చేయడు.. అయినప్పటికీ అతను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఐర్లాండ్ నివాసి అయిన డెర్మోట్ అలెస్టర్ మిల్స్ ఉద్యోగంలో కోటి రూపాయలు సంపాదిస్తాడు. కానీ అతను ఒక్క పని కూడా చేయనవసరం లేదు. దీని కారణంగా అతను ఇప్పుడు కోపంతో తను పనిచేసే కంపెనీపై కేసు పెట్టాడు.

అసలేం జరిగిందంటే..

డెర్మోట్… ఐరిష్ రైల్‌లో ఫైనాన్షియల్ మేనేజర్. కంపెనీ క్యాపిటల్ బడ్జెట్ బాధ్యత చూసుకునేవాడు. 2010లో ప్రమోషన్ కూడా ఇచ్చారు. కానీ 2013లో బలవంతంగా మరో పదవిలో కూర్చోబెట్టి, ఆ తర్వాత 3 నెలల స్టడీ లీవ్‌ ఇచ్చారు. సెలవు పెట్టి తిరిగి రాగానే బకాయిదారుల సొమ్ము విషయంలో కంపెనీలో కొంత గొడవ జరుగుతోంది. దీంతో 2014లో అతను కంపెనీ ఆర్థిక వ్యవహారాల గురించి, సంస్థలోని లోటుపాట్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడట.
అనంతరం రవాణా శాఖ మంత్రికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పటి నుంచి అతను ఆఫీసులోని అన్ని పనుల నుండి తొలగించారు., కానీ ఉద్యోగం నుండి మాత్రం తొలగించబడలేదు. రోజూ ఆఫీసుకి వచ్చిన తర్వాత అతను కేవలం వార్తాపత్రికలు చదువుతాడు, ఆహారం తింటాడు. అయినా అతనికి నెల నెలా జీతం ఇస్తాం. ఐర్లాండ్ వర్క్ ప్లేస్ రిలేషన్స్ కమీషన్‌తో డెర్మోట్ మాట్లాడుతూ..తాను రోజూ రెండు వార్తాపత్రికలను కొని వాటిని తన క్యూబికల్‌కి తీసుకెళ్తానని చెప్పాడు. అప్పుడు కంప్యూటర్‌ను తెరిచి, మెయిల్‌ని తనిఖీ చేస్తానని,కానీ ఇప్పుడు వారికి పనికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదా సందేశం ఇవ్వడం లేదని, లేదా కంపెనీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన మెయిల్‌లు అందడం లేదు కాబట్టి న్యూస్ పేపర్ చదివాక మళ్లీ మెయిల్ చెక్ చేసి ఏదైనా మెయిల్‌కి రిప్లై ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తామని తెలిపాడు.
అయితే తన జీతం గతం కన్నా తగ్గిపోయిందని డెర్మోట్ తెలిపాడు. గతంలో ఏడాదికి రూ.68 కోట్లు వచ్చేదని, ఇప్పుడు రూ.3 కోట్లు మాత్రమే వస్తోందని చెప్పారు. తన నైపుణ్యాన్ని పనికిరానిదిగా చేయడం వల్ల నిరాశకు గురయ్యానని డెర్మోట్ చెప్పాడు. ఆ డెర్మోట్ కంపెనీపై కేసు పెట్టగా, తదుపరి విచారణ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇప్పుడు చెప్పండి అతను చేసింది కరెక్టా కాదా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version