సబ్బం హరి కోర్టుకి వెళ్లరు.. ఎందుకంటే.. ఇందుకు!!

-

తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! కాసేపు ఆ వేమనగారి మాటలను ఒకపక్కన పెట్టుకుంటూనే ఈ కథనం చదువుకుందాం!! తన ఇంటి పహారీ గోడ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీంతో మైకందుకున్నారు, లైవ్ లో డిబేట్ లు పెట్టారు హరి! ఈ సందర్భంగా… అసహనంతో అధికారుల మీద, సీఎం జగన్ మీద, ఎంపీ విజయసాయి రెడ్డి మీద చెలరేగిపోయి మాట్లాడారు. సరే… మరి కోర్టుకు వెళ్తారా వెళ్లారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న!

అధికారులు నోటీసులు ఇవ్వకుండా తమ ప్రహారీగోడ, మరుగుదొడ్డిని కూల్చివేస్తే… మాజీ ఎంపీగారు ఊరుకుంటారా? వెంటనే న్యాయస్థానం తలుపు తట్టరా? తట్టాలి.. కోర్టుకి వెళ్లాలి.. ఆయనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని, అధికారులను కడిగించేయాలి! మరి ఆ పనులు మానేసి… ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని ఎలా అంటారు అనేది ఇప్పుడు విశాఖవాసుల పెద్ద డౌట్!

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… సబ్బం హరికి కోర్టుకి వెళ్లే ధమ్ము లేదు! ఎందుకంటే… మున్సిపాల్టీకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆయనకున్న స్థలం కొలతలకు, ఇప్పుడు ఆయన తన హక్కులోకి తీసుకున్న స్ధలం కొలతలకు చాలా తేడా వుంది! కోర్టులో తేలేది అదే! ఈ విషయంలో అధికారులు పక్కా క్లారిటీతో ఉన్నారు. లేకపోతే.. అంత సులువుగా ఒక మాజీ ఎంపీ వ్యవహారాన్ని టచ్ చేస్తారా?

దీంతో తాను చేసిన కబ్జా పనిని కప్పిపుచ్చుకోవడానికన్నట్లుగా… ఆ లీగల్ విషయాలు వదిలేసిన సబ్బం హరి… ఆయనేదో ప్రజలకోసం పోరాడుతున్నట్లు, అందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష తీర్చుకుంటుంన్నట్లు చెప్పుకొస్తున్నారు! సో… ఈ వ్యవహారంలో రాజకీయంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేదే ప్రస్తుతం హరి వెతుకులాట. అంతే తప్ప… అది ఆక్రమించిన భూమని హరికి తెలియదా? సో… ఓన్లీ పొలిటికల్ వర్డ్స్.. నో లీగల్ యాక్షన్ అన్నమాట!!

-Ch Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version