బ్రేకింగ్ : సచిన్ టెండూల్కర్ కి కరోనా పాజిటివ్

-

లెజెండరీ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకున్నాడు. తనకు కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని పేర్కొన్న ఆయన ‘తేలికపాటి లక్షణాలు’ కలిగి ఉన్నానని వైద్యుల సలహా మేరకు ఇంట్లో తనను తాను క్వారంటైన్ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. 

” నన్నునేను పరీక్షించుకుంటున్నాను, కోవిడ్‌ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను.  నాకు కరోనా వచ్చిన కారణంగా ఇంట్లో వారికి కూడా పరీక్షలు చేశారు, అదృష్టవశాత్తూ వారికి కరోనా సోకలేదని పేర్కొన్నారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయిచుకున్నానని ఆయన పేర్కొన్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version