మెగా కోడలి ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ఉపాసన..!

-

అపోలో వారసురాలు మెగా కోడలు ఉపాసన గురించి.. ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులకు సహాయ సహకారాలు అందించడంలో మామ చిరంజీవికి మించి ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఉపాసన అంటే సినీ ప్రేక్షకులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎనలేని అభిమానం. అనారోగ్య సమస్యలతో ఎవరైనా అపోలో హాస్పిటల్ కి వెళ్తే చాలా తక్కువ ఫీజుతో వారికి వైద్యం అందిస్తుంది. నిజంగా ఈమె గొప్ప మనసుకి ప్రతి ఒక్కరూ ఫీదా అవుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇంట తీవ్ర విషాదం నెలకొనింది.

తాజాగా ఉపాసన నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది ఉపాసన. ఆమె చివరి వరకు ఎంతో సానుభూతి, కృతజ్ఞత, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపింది. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ముఖ్యంగా నేను నా గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఎలాంటి ప్రేమానురాగాలు పొందానో.. నా పిల్లలకి కూడా ఆ అనుభూతులన్నింటిని అందేలా చూసుకుంటానని..మాట ఇస్తున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నానమ్మ అంటూ ఉపాసన ఎమోషనల్ అవుతూ పోస్ట్ షేర్ చేసింది.

ప్రస్తుతం మాతృత్వ అనుభూతిని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్న ఉపాసనకు నిజంగా ఇది తీరని లోటు అంటూ పలువురు నెటిజన్లు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version