రిప‌బ్లిక్ సినిమా ను చూసిన సాయి ధ‌ర‌మ్ తేజ్

-

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు వ‌చ్చాడు. త‌న‌కు బైక్ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత చాలా రోజుల వ‌ర‌కు త‌న అభిమానుల‌కు క‌నిపించ‌లేడు. గ‌త కొద్ది రోజ‌లు ముందు ఒక ఫ్యామిలీ ఫోటో ద్వారా అభిమానుల ముందుకు వ‌చ్చాడు. తాజాగా మ‌ళ్లీ ఈ రోజు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల ముందుకు వ‌చ్చాడు.

అయితే ఈ సారి తాను హీరో గా వ‌చ్చిన రిప‌బ్లిక్ సినిమా త‌న కుటుంబ స‌భ్యు ల తో క‌లిసి చూసాడు. ఆ విడీయో ను సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల తో పంచుకున్నాడు. కాగ సాయి ధ‌ర‌మ్ తేజ్ కు కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ వ‌ద్ద ఆక్సిడెంట్ జ‌రిగింది. ఈ ఆక్సిడెంట్ లో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అప్ప‌టి నుంచి చాలా రోజుల పాటు ఆస్ప‌త్రి లో చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయినా.. త‌న అభిమానుల ముందుకు రాలేడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version