వేసవి కాలంలో కింగ్ ఫ్రూట్ అంటే మామిడే అంటారు.. ఇక మామిడపండ్ల తర్వాత పుచ్చకాయలకు డిమాండ్ బాగుంటుంది. అసలు సమ్మర్‌లో బాగా పండిన పుచ్చకాయలు తింటుంటే భలే ఉంటుందిలే.. చల్లగా వెళ్లిపోతుంది కదా..! వేడి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే పుచ్చకాయల్లో మనకు రెడ్ కలర్‌వే తెలుసుకదా.. పైన గ్రీన్ కలర్‌లో ఉండి చారలు ఉంటాయి.. ఇంకో వాటికి ఎలాంటి చారలు లేకుండా.. డార్క్ గ్రీన్ ఉంటాయి. పైన ఆకారం ఎలా ఉన్నా ఈ రెండు కట్ చేస్తే పండు మాత్రం ఎర్రగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎల్లో పుచ్చకాయలు కూడా వస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా బాగుందట. ఎందుకు ఇందులో ఏమైన స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయా..?
మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు (Yellow Water Melon) సందడి చేస్తున్నాయి. ఆధునిక పద్దతుల్లో పంటలను పండిస్తూ రకరకాల పండ్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు రైతులు. పసుపు రంగు పుచ్చకాయ తిరుపతి నగర వీధుల్లో దర్శనమిస్తోంది. మొదట్లో ఈ పుచ్చకాయ ముక్కను చూసి ఫైన్ ఆపిల్ అనుకునేవాళ్లట. కానీ ఆ తరువాత పుచ్చకాయ అని తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీంతో పుచ్చకాయ వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. మనం సాధారణంగా తినే ఎరుపు రంగు పుచ్చకాయ కంటే పసుపు రంగు పుచ్చకాయ రుచి అద్భుతంగా ఉందని ఈ పుచ్చకాయ టేస్ట్ చేసిన తిరుపతి నగర వాసులు అంటున్నారు. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో పండించే ఈ పంట ఇటీవల్ల ఆంధ్రలో అడుగు పెట్టింది. ప్రస్తుతం గూడూరుతో పాటు అనంతపురం, కడప జిల్లాల్లోని రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లోనూ ఎరుపుతో పాటు పసుపు, ఆకుపచ్చ పుచ్చకాయలను కొందరు యువరైతులు పండించారు కూడా.!
అలా పసుపురంగు పుచ్చకాయ పండించిన రైతులకు లాభాన్ని.. తిన్నవారికి సంతృప్తిని ఇస్తుంది. ఈసారి మీరు తిరుపతి వెళ్తే ఈ టైప్ పుచ్చకాయను తప్పకుండా ట్రై చేయండి మరీ..!