సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్: కన్ఫ్యూజన్ లో సాయి తేజ్..

-

కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న తెలుగు చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ రిలీజైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా కనిపిస్తుంది. సో బ్రతుకే సో బెటర్ అని చెప్తూ పెళ్ళికి, అనుబంధాలకి దూరంగా ఉండే హీరో, ఆ తర్వాత వయసు మీద పడుతున్న కారణంగా ప్రేమలో పడి, పెళ్ళి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే అప్పటి వరకూ అందరికీ హితబోధన చేసిన హీరోకి ఎలాంటి పరిస్థితి ఎదురైందన్నది ఆసక్తిగా ఉంది.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్, సాయి తేజ్ ని ఇన్ఫ్ల్యూయెన్స్ చేసే విధంగా ఉంది. ట్రైలర్ చివర్లో ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన మాటలని విన్న సాయి తేజ్ ఆశ్చర్యపోవడం చూస్తుంటే సినిమా మొత్తం పెళ్ళి చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లోనే సాగేలా ఉంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సుబ్బు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా క్రిస్ మస్ కానుకగా డిసెంబరు 25వ తేదీన రిలీజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version