Saindhav Movie : వెంక‌టేశ్ సైంధవ్ నుంచి ‘బుజ్జికొండవే’ సాంగ్ రిలీజ్

-

హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌ . ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతుంది.వెంకటేష్‌ నటిస్తున్న 75వ చిత్రనికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 

ఇదిలావుంటే.. తాజాగా చిత్రం నుంచి మేక‌ర్స్ థ‌ర్డ్ సింగిల్ ‘బుజ్జికొండవే’ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట చూస్తే.. వెంకీ, కూతురు మధ్య ఎమోష‌న‌ల్‌గా ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ పాట‌ను S. P చరణ్ పాడారు. సంతోష్ నారాయణన్ సంగీతం స‌మ‌కూర్చగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ,ఆండ్రియా జెర్మియా, ఆర్య, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమా తో టాలీవుడ్‌ ఎంట్రీ చేయబోతున్నరు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version