నువ్వు టెన్త్ రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి? : లోకేష్ కు విజయసాయి కౌంటర్

-

ఏపీ పదో తరగతి ఫలితాలపై పెద్ద జరుగుతోంది. జగన్ సర్కార్ తప్పిదం వల్లే చాలా మంది ఫెయిల్ అయ్యారని టిడిపి ఆరోపనలు చేస్తోంది. అయితే టిడిపి కి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ అంటూ అగ్రహించారు.

పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావని మండిపడ్డారు విజయసాయి రెడ్డి. చదువు’కొన్న’వాడివి. నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి? అని నారా లోకేష్ ను ఎద్దేవా చేశారు విజేశాయి రెడ్డి.

హాయిగా చికెన్ తింటూ ఎంజాయ్ చేయక మీకెందుకు నారాయణ గారు సవాళ్లు? ఆంధ్రాలో ఎక్కడా మీరు వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేరని చురకలు అంటించారు.  ‘తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు నిలబడి తొడకొట్టినట్లుంది మీ సవాళ్ల సంబరం’ అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version