అన్న స్ఫూర్తితోనే ఆర్మీలో చేరా..ఇకపై అన్నీ నేనే చూసుకుంటా : సాయి తేజ తమ్ముడు

-

బుధవారం తమిళనాడులో బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. సాయి తేజ స్వగ్రామం ఎగువరేగడ పల్లెల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ,కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు సాయి తేజను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. సాయి తేజ మృతదేహం కోసం అంతా ఎదురు చూస్తూ గడిపారు. అంతే కాకుండా సాయి తేజ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సాయి తేజ ఇంటికి వంద అడుగుల దూరంలో పొలం వద్ద అంత్యక్రియల కోసం చదువును చేశారు. అంతే కాకుండా సాయి తేజకు గౌరవ వందనం పలికేందుకు ఊర్లోని మైదానం వద్ద ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ రవి ఆధ్వర్యం లో మైదానం లో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సాయి తేజ తమ్ముడు మహేష్ బాబు కూడా అర్మీలోనే పని చేస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…మా అన్న స్ఫూర్తితోనే నేను కూడా అర్మిలో చేరానని చెప్పాడు. అమ్మానాన్న వదినకు ధైర్యం చెప్పానని ఇకపై అన్నీ తానే చూసుకుంటా అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version