బాలినేని అలకపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ !

-

గత మూడు రోజుల నుండి ఏపీ అధికార పార్టీలో కీలక నాయకుడు పార్టీని వీడనున్నారని వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు ప్రస్తుతం పార్టీఇచ్చిన పదవులను చేయలేనని రాజయినామ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి క్లారిటీ ఇచ్చారు. బాలినేని తన పదవులకు రాజీనామా చేసిన విషయం వాస్తవమే. అయితే ఇది పూర్తిగా ఆయన అంతర్గత వ్యవహారం. తనకు పదవుల కన్నా పార్టీ నా నియోజకవర్గంలో బలంగా ఉండాలని మంచి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప మరేదీ కాదని క్లారిటీ ఇచ్చారు.

ఇంతమాత్రానికి ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముకాసే మీడియా చానెళ్లు అన్నీ వైసీపీ నుండి కీలక నాయకుడు రాజీనామా ? అంటూ వాళ్లకు తోచిన హెడ్ లైన్ లు వేసుకుని రాక్షసానందాన్ని పొందుతున్నారని క్లారిటీ ఇచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version