స్కిల్ స్కామ్ రూపకర్త చంద్రబాబు అని, అన్ని ఆధారాలతోనే సీఐడీ ఆయనను అరెస్ట్ చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘చేసిన నేరానికి తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల బాబు జీవితమంతా అవినీతి మయం. రాష్ట్రంలో ఎవరూ అవినీతి చేయొద్దనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతోంది’ అని సజ్జల స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు లోకేష్ వ్యవహారాన్ని ప్రజలంతా చూశారు.
శనివారం నుంచి టీడీపీ..శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ రూపకర్త, దర్శకత్వం అంతా చంద్రబాబే. స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి. ఏడాదిన్నర నుంచి కేసు దర్యాప్తు జరుగుతోంది. అన్ని ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబును అదుపులోకి తీసుకున్నప్పటినుంచి నారా, నందమూరి కుటుంబాలు లెక్కలేనంతగా వ్యవహరించాయి. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ కుంభకోణం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. అని సజ్జల వ్యాఖ్యనించారు. ఇవాళ చంద్రబాబును రిమాండ్ కు పంపడం అనేది పెద్ద విషయం అని మేం భావించడంలేదు. దర్యాప్తు ప్రక్రియలో అదొక భాగం. ఇందులో ఆరోపణలు రుజువు చేయాల్సి ఉంది.