చాలాకాలంగా మాజీ ఎంపీ వివెకానందరెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. తాజాగా ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మరియు ఎల్లో మీడియాపై కొన్ని కీలక క్యాఖ్యలు చేశాడు. మొదటి నుండి కూడా ఈ కేసులో విచారణను సక్రమంగా జరగనీయకుండా, పక్కదోవ పట్టేలాగా ఎల్లో మీడియా వ్యవహరాయించిందని సజ్జల మండిపడ్డారు. ఇంతకు ముందు విచారణ చేసిన సిబిఐ టీం సరైన రీతిలో విచారణ సాగించలేదని చెప్పానని సజ్జల అన్నారు. కోర్ట్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందన్నారు, ఈ కేసులో ఎంత కాలం విచారణ జరిగినా.. సత్యాన్ని దాచి పెట్టాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.