నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలహీనపడుతుందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై జగన్ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల వైసీపీ నుండి బహిష్కరించిన కోటంరెడ్డి మరియు ఆనం రామనారాయణ రెడ్డి లు ఇంచార్జి లుగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జి లను నియమించాడు. ఇక అదే పనిలో ఉదయగిరి వైసీపీ ఇంచార్జి ను నియమించడానికి కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఉదయగిరి ఇంచార్జి గా ఎవరిని నియమిస్తారో అన్న సందిగ్ధంలో ఉండగానే.. ఈ రోజు జరిగిన ఒక భేటీ ఒక సమాధానమా అని తెలుస్తోంది. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి తాజాగా సీఎం జగన్ ను కలవడం జరిగింది.
సీఎం జగన్ తో భేటీ అయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి…
-