కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో అద్బుతమయిన పధకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రూ. లక్ష కోట్ల నిధులతో ఒక పథకాన్ని స్టార్ట్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా గిడ్డంగుల సంఖ్యను మరింతగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పధకం ద్వారా మొత్తం 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిలువ చేయగలుగుతాము. ఇది ఎంతమంది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందో అన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ గిడ్డంగులను సహకార రంగంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.