ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మరియు టీడీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలనలో ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది వైసీపీ అని, టీడీపీ అధికారం గురించి మరిచిపోవడం మంచిదని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజల ఇళ్ల స్థలాల గురించి చేసిన వ్యంగ్య పూరిత వ్యాఖ్యలను ప్రస్తావించారు. సెంటు స్థలంలో సమాధులు కట్టుకోండి అంటూ అహంకారంతో మాట్లాడిన విధానాన్ని సజ్జల పూర్తిగా ఖండించారు. పెదాలపై ఇంత చులకాజ్ఞా భావం ఉంది కనుకే గత ఎన్నికల్లో పంగనామాలు పెట్టారు అంటూ చంద్రబాబు పై మండిపడ్డారు.
చంద్రబాబుకు రాజకీయంగా పేదలు ఎప్పుడో సమాధి కట్టారు : సజ్జల రామకృష్ణ రెడ్డి
-