ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు : సజ్జల

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. వరద బాధితులకు సాయంపై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై కౌంటరిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబులా తాము హడావుడి చేయమని, వరద సాయం నేరుగా బాధితులకు అందుతోందన్నారు.

ఏపీలో కోటి 46 లక్షల కుటుంబాలను కలిశామన్నారు. అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలు, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. పటిష్టమైన వ్యవస్థ వల్లే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాము సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. అక్కడకు జగన్ వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, తమ ప్రభుత్వం ఎవరికీ దోచి పెట్టడం లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version