మెగా ఫాన్స్‌ సిద్ధం కండి.. భోళా శంకర్‌ ప్రీ రిలీజ్‌ డేట్‌ లాక్‌

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టయినర్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈసినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. మెగా ఫ్యాన్స్ భోళా శంకర్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈమూవీకి సబంధించి ఓ అప్ డేట్ తాజాగా వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను కూడా ఖరారు చేశారు. హైదరాబాద్ లోని ‘శిల్పకళావేదిక’లో ఈ నెల 6వ తేదీన రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుకను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాత్రలో మెగాస్టార్ చేసే మేజిక్ గురించే అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితమే రజనీకి చెల్లెలిగా చేసిన కీర్తి సురేశ్, ఆ వెంటనే మెగాస్టార్ కి చెల్లెలిగా చేయడం విశేషం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version