చాలా మంది ముల్లంగిని ఇష్టపడుతూ ఉంటారు. ముల్లంగితో పరాటా, చట్నీ ఇలా చాలా రకాల వంటకాలని తయారు చేసుకుంటూ ఉంటారు. మీకు కూడా ముల్లంగి అంటే ఇష్టమా..? అయితే ముల్లంగి తినేటప్పుడు కచ్చితంగా వీటిని మాత్రం తీసుకోకండి. ముల్లంగితో పాటుగా వీటిని తీసుకోవడం వలన సమస్యలు కలుగుతాయి. అయితే మరి ముల్లంగి తో ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు..? ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
ముల్లంగి, కాకరకాయ:
మీరు ముల్లంగిని కాకరకాయ తో తిన్నట్లయితే సమస్యలు వస్తాయి ముల్లంగి తినేటప్పుడు అసలు కాకరకాయను తీసుకోకండి. ఈ రెండిటిని కలిపి తినడం వలన శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
ముల్లంగి, కమల:
ముల్లంగి కమల కలిపి తినద్దు. ముల్లంగి కమలా కలిపి తింటే మలబద్ధకం సమస్య వస్తుంది అలానే కడుపుకు సంబంధించిన వివిధ సమస్యలు కూడా రావచ్చు.
ముల్లంగి, కీర:
ముల్లంగి కీర కలిపి చాలా మంది సలాడ్ లో తింటూ ఉంటారు ఇలా చేయడం వలన విటమిన్ సి మీకు అందదు.
ముల్లంగి, కీర్:
పాలతో చేసిన కీర్ ని ఎప్పుడు కూడా ముల్లంగితో తీసుకోకండి.
ముల్లంగి, పాలు:
ముల్లంగి తో పాటుగా పాలు తాగితే కూడా సమస్యలు వస్తాయి. చర్మ సమస్యలు ఈ రెండిటినీ తినడం కలిపి తీసుకోవడం వలన వస్తాయి.
ముల్లంగి, టీ:
ముల్లంగి టీ ఒకేసారి తీసుకుంటే ఎసిడిటీ మలబద్ధకం వస్తాయి.
ముల్లంగి, పన్నీర్:
ఇలా తీసుకున్నా కూడా చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కాంబినేషన్స్ ని అసలు ట్రై చేయొద్దు.