వైసీపీ పార్టీకి ఎప్పటికీ ఓటమి ఉండదు – సజ్జల సంచలనం

-

వైసీపీ పార్టీకి ఎప్పటికీ ఓటమి ఉండదని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… 12 ఏళ్లుగా వైఎస్ జగన్ ఆదర్శ వంతంగా పార్టీని నడుపుతున్నారని… నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వై ఎస్ జగన్ అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడారు.. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాల చేస్తున్నారని తెలిపారు. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారు.. విద్య, వైద్య రంగాల్లో దేశంలో నే ఆదర్శం గా నిలిచేలా సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు.

దేశ చరిత్రలోనే ఎవ్వరు చెయ్యని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు.. సచివాలయ వ్యవస్థ తో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారని వెల్లడించారు సజ్జల రామకృష్ణా. మహిళలకు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదని.. సీఎం జగన్ అధికారాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ రోల్ మోడల్ అని.. ఈ పార్టీ కి ఎప్పటికీ ఓటమి ఉండదని తేల్చి చెప్పారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Exit mobile version