గత వారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంకు పుంగనూరు బై పాస్ మీదుగా వెళ్లాల్సి ఉండగా, కావాలనే పుంగనూరు లోపలి ఎంటర్ అయ్యి చాలా గొడవలకు కారణం అయ్యాడని వైసీపీ నేతలు మరియు పోలీస్ శాఖ చెబుతున్న విషయం తెలిసిందే, తాజాగా ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పారు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యం అంటూ ఆగ్రహంగా మాట్లాడారు సజ్జల. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా తగలబెట్టడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు, పుంగనూరు నుండి మొదటగా స్టార్ట్ చేశారు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. ఇందుకు సాక్ష్యమే టీడీపీ కార్యకర్తలు పోలీస్ లపై మరియు వైసీపీ నేతలపై ఒక గూండాల్లాగా విరుచుకుపడిన తీరు .. మొత్తం రాళ్లు, కర్రలతో వచ్చిన విధానం దారుణం అంటూ సజ్జల సీరియస్ అయ్యారు.
పుంగనూరు ఘటనపై చంద్రబాబు పై ప్రభుత్వ సలహాదారు ఫైర్ …
-