రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సజ్జల సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చని.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చు…దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
టెక్నికల్ గా ప్రస్తుతం పాలన ఎక్కడి నుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుందని.. భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్రం బడ్జెట్ లో ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నారని.. కేంద్ర బడ్జెట్ లో ఈ సారి కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందన్నారు. ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పడం లేదని.. పేర్కొన్నారు. మార్పులకు అవకాశం ఎప్పుడూ ఉంటుందని.. చర్చలకు వచ్చి పరిష్కరించు కోవాలని ఉద్యోగులను కోరుతున్నామని పేర్కొన్నారు సజ్జల. గతంలో టీడీపీ బీజేపీతో పార్ట్ నర్ గా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం చేశారని.. జగన్ మోహన్ రెడ్డి వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని.. ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతుందన్నారు.