మహాలక్ష్మి స్కీం లో భాగంగా ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకాన్ని తీసుకువచ్చిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుర్తు చేశారు 7200 పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికి ఆయన సంతోషంగా ఉందని చెప్పారు డిసెంబర్ 9 నుండి ఇప్పటిదాకా 11 కోట్ల మందికి పైగా మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుకున్నట్లు ఆయన చెప్పారు.
ఈ స్కీమ్ ని ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నట్లు ఆయన అన్నారు శుక్రవారం గణతంత్ర దినోత్సవం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేంద్ర కార్యాలయం బస్సు భవన్లో జరిగింది. సజ్జనార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు రద్దీ పెరగడం వలన ఎక్కువ బస్సులను తీసుకురావాలని చూస్తున్నట్లు చెప్పారు 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు వీలైనంత త్వరగా డ్రైవర్లు కండక్టర్ల రిక్రూట్మెంట్ ని చేపడతామన్నారు