ఓమిక్రాన్ ఎఫెక్ట్ : ఆర్టీసీ లో కొత్త రూల్స్ జారీ చేసిన స‌జ్జ‌నార్

-

దేశం లో ఓమిక్రాన్ కేసులు క్ర‌మం గా పెరుగుత‌న్న నేప‌థ్యం లో తెలంగాణ ఆర్టీసీ ముందస్తు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఆర్టీసీ కి సంబంధించి కొత్త నిబంధ‌న‌ల కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ జారీ చేశారు. ఈ కొత్త నిబంధ‌నల‌ ప్ర‌కారం ఇక నుంచి ప్ర‌యాణికుల‌కు మాస్క్ ఉంటే నే బ‌స్సు లోకి అనుమ‌తి ఉంటుంది. అలాగే బ‌స్స‌లో కండ‌క్ట‌ర్ తో పాటు డ్రైవ‌ర్ త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాలి.

అలాగే ప్ర‌తి బస్సు లో శానిటైజ‌ర్ బాటిల‌ను అందుబాటు లో ఉంచుకోవాలి. అలాగే కరోనా వైర‌స్ వ్యాప్తి గురించి అన్ని బ‌స్ స్టాప్ ల‌లో మైక్ ల‌తో ప్ర‌యాణికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తం గా అన్ని బ‌స్సుల‌ను, బ‌స్ స్టాప్ ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేయాలి. అలాగే రెస్ట్ రూం ల‌లో స‌బ్బుల‌ను అందుబాటు లో ఉంచాలి. ఇలా క‌రోనా వ్యాప్తి ని అరిక‌ట్ట‌డానికి ప్రత్యేకం గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ స‌జ్జ‌నార్ అధికారుల‌ను ఆదేశించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version