ఆర్టీసీ బస్సులో హీరో వెంకటేష్ ఫ్యామిలీ.. వీడియో షేర్ చేసిన సజ్జనార్

-

ఆర్టీసీ ఎండీ గా మాజీ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

ఈ నేపథ్యంలో అనేక సినిమా క్లిప్పింగ్ లను ఆయన షేర్ చేశారు. ఇంకా సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించే వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. సదూర ప్రయాణాలకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి తన ప్రత్యేకతను చాటారు సజ్జనారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్(Hero Venkatesh) ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీన్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను సజ్జనార్ షేర్ చేశారు. ‘‘కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది.’’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు సజ్జనార్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version