కేసీఆర్‌ను కలిసిన నల్గొండ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో… అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టకపోయినా… వెనుక ఉండి చక్రం తిప్పింది. పింగిలి శ్రీపాల్ రెడ్డి , ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్లను వెనుకుండి నడిపించారు కేసీఆర్‌. ఇక ఇందులో పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలవుగా… ప్రసన్న హరికృష్ణ పోరాడి ఓడిపోయాడు.

Nalgonda MLC Pingili Sripal Reddy met KCR

ఈ తరుణంలోనే… కేసీఆర్‌ను కలిశారు నల్గొండ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిశారు.  కాగా… నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version