శ‌బాష్ స‌జ్జ‌న్నార్..81 రోజుల్లో 1934 కొత్త ట్రిప్పులు..!

-

పోలీస్ శాక‌లో త‌న దూకుడు ప్ర‌ద‌ర్శించి శ‌బాష్ అనిపించుకున్న స‌జ్జ‌న్నార్ ఆర్టీసీలోనూ త‌న మ‌ర్క్ ను చూపిస్తున్నారు. కొత్త కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటూ ఆర్టీని సామాన్యుడికి మ‌రింత చేరువ చేస్తున్నారు. అంతే కాకుండా ఆయ‌న కూడా ప‌లు మార్లు ఆర్టీసీలో ప్ర‌యాణిస్తూ ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆయ‌న విద్యార్థులు, మ‌హిళ‌ల నుండి వ‌స్తున్న రిక్వెస్ట్ ల‌ను కూడా ప‌రిశీలించి బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే 81 రోజుల్లో త‌మ ప్రాంతాల్లో బ‌స్సులు న‌డ‌పాల‌ని రిక్వెస్ట్ లు రాగా 151 కొత్త స‌ర్వీసుల‌ను ప్రారంభించారు. అయితే ఆ బ‌స్సులు ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 1934 కొత్త ట్రిప్పుల‌ను పూర్తి చేసుకున్నాయి. అలా త‌క్కువ వ్య‌వ‌ధిలో ఎక్కువ ట్రిప్పులు కొట్టినందుకు గానూ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఉద్యోగుల‌ను మ‌రియు స‌జ్జ‌న్నార్ ను అభినందిస్తూ ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version