PushpaTrailer : ”పుష్ప” ట్రైలర్ ముహుర్తం ఫిక్స్.. ఇక తగ్గేదేలే

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సెన్సెషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్‌ గా రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. క ఈ పాన్‌ ఇండియా మూవీ లో ఐకాన్‌ స్టార్‌ హీరో బన్నీకి జోడీగా శ్రీ వల్లి పాత్ర లో రష్మిక మందనా నటిస్తోంది. చిత్రంలో ఫహద్ ఫాసిల్​, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మ‌రోవైపు యాంకర్ అన‌సూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనం ఇవ్వనున్నది. ఇప్పటికే ఎన్నో రికార్డుల‌ను తిరగ‌రాసింది ఈ మూవీ. ఈ సినిమా మీద మరింత హైప్స్ క్రియేట్ అయ్యేలా ఐటెం సాంగ్​లో సమంత నటించనుండటం విశేషం. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్‌ వచ్చింది.ఈ సినిమా ట్రైలర్‌ ముహుర్తాన్ని ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. పుష్ప ట్రైలర్‌ ను డిసెంబర్‌ 6 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ వదిలింది చిత్ర బృందం. ఈ అప్డేట్‌ తో బన్నీ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version