ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కరోనా వేరియంట్ గజగజ వణికిస్తోెంది. ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి పట్ల ప్రపంచ దేశాలు గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. మరోవైపు కొన్ని దేశాలు.. ఓమిక్రాన్ ప్రభావిత దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. కాగా ఇండియా కూడా ఓమిక్రాన్ వేరియంట్ పై అలెర్ట్ అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తాజాగా ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని క్లోజ్ గా మానిటరింగ్ చేయాలని కేంద్రం సూచించింది.
ఇటీవల మూడురోజుల నుంచి ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచే కాకుండా కరోనా రిస్క్ ఉన్న12 దేశాల నుంచి వచ్చిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వీరందరికి కరోనా టెస్టులు కూడా చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి 185 మంది, బోట్స్ వానా నుంచి 16 మంది తెలంగాణకు వచ్చారు. వీరందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా… 11 మందికి కరోనా సోకిందని తేలింది. అయితే వీరందరికి ఏ వేరియంట్ కరోనా సోకిందో తెలియాల్సి ఉంది. వీరందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. దీనిలో వారికి ఏ వేరియంట్ సోకిందో తెలియనుంది. ఒక వేళ ఎవరికైాన ఓమిక్రాన్ వేరియంట్ సోకితే మాత్రం తెలంగాణలో డేంజర్స్ బెల్స్ మోగినట్లే..