ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి టాటా సఫారీలో బెంగళూరు వైపునకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.ముందస్తు సమాచారం మేరకు కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్,మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ బృందాలు మణుగూరులోని రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలోనే టాటా సఫారీ కారును చెక్ చేయగా అందులో గంజాయిని గుర్తించారు. పట్టుబడిన గంజాయి 64 కేజీలు ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. గంజాయి, సఫారీ వాహనం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.19.10 లక్షలుగా ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరమ్ చంద్ తెలిపారు. నిందితుడు కేరళకు చెందిన మహ్మద్ జమీర్‌గా గుర్తించారు.