సలార్: ప్రభాస్ ఢీ కొట్టబోయేది ఎవరినంటే?

-

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అందులో ప్రభాస్ హీరో కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజా అప్డేట్ బయటకి వచ్చింది. కేజీఎఫ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్లని చూపించిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాలో ఎవరిని తీసుకొస్తాడనేది ఆసక్తిగా మారింది.

తాజా సమాచారం ప్రకారం సలార్ సినిమాకి విలన్ దొరికేసాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని సలార్ ఢీ కొట్టబోయేది ఎవరా అని చూసినవారందరికీ షాక్ ఇచ్చేలా కన్నడ నటుడు మధు గురుస్వామిని తీసుకున్నారు. చాలా మంది అభిమానులు బాలీవుడ్ నుండి విలన్ వస్తాదని అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ కన్నడ నుండి మధు గురుస్వామిని తీసుకున్నారు. మరి మధు గురుస్వామి విలనిజం సలార్ లో ఎలా ఉంటుందో, ఆ విలనిజాన్ని ఎదుర్కొనే ప్రభాస్ హీరోయిజం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version