Salar: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్….

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ వన్ : సీజ్ ఫైర్ తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు నైజాం డిస్ట్రిబ్యూటర్ ‘మైత్రీ’ గుడ్ న్యూస్ చెప్పింది. RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో కాస్త ముందుగానే ‘సలార్’ స్పెషల్ షో ఉంటుందని పేర్కొంది. షోకు సంబంధించిన టికెట్స్ ఈరోజు సాయంత్రం 4.59 గంటలకు థియేటర్లోని కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపింది. నైజాం టికెట్ ఆన్లైన్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ మూవీ ఈనెల 22న రిలీజ్ కానుంది.

కాగా… ఈ సినిమా ఈనెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్,జగపతిబాబు ,ఈశ్వరి కుమారి ,శ్రీయ రెడ్డి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రుర్ సంగీతాన్ని అందించగా భువన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version