హైదరాబాద్‌ హోటల్‌లో సల్మాన్ భాయ్ సందడి..

-

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో సల్లూ భాయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కండలవీరుడికి ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కు రావడం చర్చనీయాంశమవుతున్నది. సల్లూ భాయ్ ఉంటున్న హైదరాబాద్ హోటల్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. హోటల్ లో తనకు నచ్చిన ఫుడ్ ను సల్మాన్ ఖాన్ తానే సర్వ్ చేసుకుంటున్న ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.

సల్మాన్ భాయ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ లో కీరోల్ ప్లే చేస్తున్నారు. వీరిరువురు ఈ సాంగ్ లో ఓ పాటకు స్టెప్పులేయనున్నారు. ఈ పాటను డ్యాన్సింగ్ లెజెండ్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ మాలీవుడ్ (మలయాళ)సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్. ఇందులో నయన తార కీలక పాత్ర పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version