బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ హీరో కపిల్ శర్మ టాక్ షోలో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లి, బ్రేకప్ పై పలు విషయాలు చెప్పకు వచ్చారు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లవ్ ఎఫైర్స్ చాలానే ఉన్నాయి. ఈ హీరో సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక లవ్ ఫెయిల్ కంటిన్యూ అవుతూనే వస్తుంది 80లో సంగీత బిజిలానీ, సోమి అలీ కాగా.. అనంతరం ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ వరకు చాలా మందితో ఎఫైర్స్ నడిపాడు సల్మాన్. కానీ ఏ ఒక్క రిలేషన్ కూడా పెళ్లి వరకు రాలేకపోయింది. దీంతో ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటున్నాడు సల్లూ భాయ్. అయితే కపిల్ శర్మ షో లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ను మిమ్మల్ని జాన్ అని పిలిచే హక్కు ఎవరికీ ఉంటుంది అని ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ వైరల్ కామెంట్స్ చేశారు.
కాగా తనను జాన్ అని పిలిచే హక్కు ఎవరికీ ఇవ్వకూడదని ఫిక్స్ అయినట్లు వెల్లడించారు. ఎందుకంటే ముందు వారు జాన్ అని పిలవడం ప్రారంభించి, ఆ తర్వాత అతని జీవితాన్ని బలిగొంటారని చెప్పారు. ‘నీతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాలినంటూ స్టార్ట్ చేస్తారు. కొంత రోజులు గడిచాక ఐ లవ్ యు అని చెప్పాక ఇక జీవితం నాశనం అవుతుంది..’ అని చెప్పుకొచ్చారు.
అలాగే ‘జాన్’ అనే పిలుపు ఇన్‌కంప్లీట్ వర్డ్‌గా తెలిపిన సల్మాన్ ఖాన్.. ‘నేను నీ ప్రాణాన్ని తీస్తాను, మరొకరిని నా ప్రాణంగా చేసుకుంటాను. ఆ తర్వాత అతని జీవితాన్ని కూడా బలి తీసుకుంటాను’ అనేదే అసలు అర్థమని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రోమోను ‘సల్మాన్ ప్రతి మనిషి తరపున మాట్లాడుతున్నాడు!’ అనే క్యాప్షన్‌తో సోనీ టీవీ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేయగా వైరల్ అయింది. అలాగే ప్రేమ పేరుతో చాలామంది అమ్మాయిలు తనకు దగ్గరైనప్పటికీ కొన్నాళ్ల తర్వాత దూరం అయిపోయారని సల్మాన్ ఖాన్ గానే ఉండిపోవాలని డెసిషన్ చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నట్టు తెలిపారు.