ఆర్యన్ ఖాన్ అరెస్ట్..షారుక్ కు సల్మాన్ పరామర్శ..!

బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ముంబై లో క్రూయిజ్ నౌకలో జరిగిన పార్టీలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు పలువురు సెలబ్రిటీల కొడుకులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎన్సిబీ అధికారులు షారుక్ ఖాన్ కొడుకును నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ కు బాలీవుడ్ లోని పలువురు మద్దతు తెలుపుతున్నారు. సాయంత్రం షారుక్ ఖాన్ కోర్టు వద్ద ఉండగా రాత్రి 11 గంటలకు సల్మాన్ ఖాన్ వెళ్లి పరామర్శించారు.

గతంలో సల్మాన్ షారుక్ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలుసుకోవడంతో ఆ వార్తలకు చెక్ పడింది. అంతేకాకుండా షారుక్ ఖాన్ కు బాలీవుడ్ లో ఒకే ఒక సోదరుడు సల్మాన్ ఖాన్ సల్మాన్ అంటూ అభిమానులు అంటున్నారు. ఈ కేసులో ఉన్న పలువురు ప్రముఖుల కుమారులపై సైతం అధికారులు విచారణ జరుపుతున్నారు. పార్టీలో డ్రగ్స్ భారీ మొత్తంలో డ్రగ్స్ దొరకడంతో ఆర్యన్ ఖాన్ తో పాటు పార్టీకి హాజరైన వారిపై కేసులు నమోదయ్యాయి.