సరిహద్దులను కాపాడే వీరులకు సెల్యూట్ చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా బండి సంజయ్ ఆదివారం ఉదయం స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బంది త్యాగాలను ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
బీఎస్ఎఫ్ రైజింగ్ డే నాడు, మన దేశ సరిహద్దులను అచంచలమైన సంకల్పంతో కాపాడే వీరులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.అలాగే, సవాల్‌తో కూడిన భూభాగాల్లో వారి కనికరంలేని సేవ దేశం పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. అంతేగాక బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యానికి, త్యాగానికి వందనం అంటూ..జై హింద్! అని బండి సంజయ్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.