ఒక్క కాకినాడ నుంచే 48,531 కోట్లు PDS రైస్ అక్రమ ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. 6300 కోట్ల రూపాయల బియ్యం కోవిడ్ ముసుగులో తరలించేసారని ఆగ్రహించారు. కాకినాడ నుంచి తప్ప మరే పోర్టు నుంచీ రైస్ ఎగుమతి లేదని… కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ కు ఏ వాటాలు ఉన్నాయి.. ఎందుకు గతంలో మాట్లాడలేదని ప్రశ్నించారు. బియ్యం సేకరణకు ఒక వ్యవస్ధ ఏర్పాటు చేసారు…రైస్ స్మగ్లింగ్ కు రైస్ మిల్లులు కూడా వాడేసారని ఫైర్ అయ్యారు.
కె.వి.రావు కుటుంబాన్ని హింసించి.. అరబిందోకి 41% వాటా మరలించారెందుకు అని ప్రశ్నించారు. రైస్ స్మగ్లింమగ్ మాఫియాను రాష్ట్రం నుంచీ తొలగించాలని… ఉపముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రజలకు మేలు చేయడానికే అన్నారు. ప్రజలకు మేలు చేయడానికి మేం ఎప్పుడూ నిలబడతామని… బియ్యం దళారుల చేతిలోకి వెళ్ళిపోయినపుడు అరికట్టాల్సిన బాధ్యత మాకుందని తేల్చి చెప్పారు. పోర్టుపైన ఎక్కువ దృష్టి సారిస్తే వేలాది మంది ఉపాధి కోల్పోతారని పలు మార్గాల ద్వారా తెలిసిందని తెలిపారు.