సమంత: యశోద సినిమా కోసం అన్ని కోట్లా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగిస్తున్న సమయంలోనే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన ఈమె ఒక్కసారిగా ఈమె పేరు మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే పుష్ప చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించి సోషల్ మీడియాని షేక్ చేసింది.

ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాలలో చాలా బిజీగా ఉన్నది. ఇందులో లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న యశోద సినిమా నుంచీ ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి అభిమానులకు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం ఏమిటంటే.. సమంత రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని అత్యధికంగా ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.

ఇక పుష్ప సినిమాలో నటించిన ఒక స్పెషల్ సాంగ్ కోసం దాదాపుగా కోటిన్నర రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం యశోద కోసం ఈమె ఏకంగా రూ.3.5 కోట్ల రూపాయలు పారితోషకం అందుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. ఇక డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version