పీపీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

పీపీఎఫ్ ఖాతాదారులు అకౌంట్ ని ఓపెన్ చేసిన 15 ఏళ్లుకు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు కూడా మీ డబ్బులని విత్ డ్రా చేసుకోవాలని అనుకుంటే ఇలా చెయ్యండి. అప్పుడు సులభంగా డబ్బులను విత్ డ్రా చెయ్యచ్చు.

పూర్తి వివరాల లోకి వెళితే.. మెచ్యూరిటీ సమయంలో పీపీఎఫ్ అకౌంట్ల నుండి మొత్తం కార్పస్‌ను విత్ డ్రా చేయవచ్చు. అకౌంట్ ని ఓపెన్ చేసిన ఏడు ఏళ్ళకి ప్రభుత్వం ఖాతాదారులకు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ఆర్ధిక సంవత్సరం లో ఒకసారి మాత్రమే విత్ డ్రా చెయ్యచ్చు.

అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్లను ముందస్తుగా మూసివేయడానికి పెర్మిషన్ వుంది. బ్యాంకు లేదా పోస్టాఫీసు నుండి విత్ డ్రా చెయ్యచ్చు. అయితే ఫారం సీ కాఫీని సమర్పించాలి.

అయితే మీరు మొదట బ్యాంకు వెబ్‌సైట్‌లో ఫామ్ సీ ని కానీ పీపీఎఫ్ విత్ డ్రాయల్ ఫామ్‌ను కానీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఫామ్ సీలో మూడు సెక్షన్స్ ఉంటాయి.

అయితే డిక్లరేషన్ సెక్షన్ లో మీ పీపీఎఫ్ అకౌంట్ నెంబర్, అకౌంట్ నుండి ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలి.
అకౌంట్ యాక్టివ్‌లో ఎప్పటి నుండి వుందో చెప్పాలి.
మైనర్స్ అయితే వారి పేర్లను చెప్పాలి.

ఆఫీసు యూజ్ సెక్షన్:

ఇది ఎందుకంటే ఆఫీసు తాలూకది ఇది. విత్ డ్రాయల్ సమయంలో మీ పీపీఎఫ్ అకౌంట్‌లో ఎంత అమౌంట్ వుందో చెబుతారు.
లాస్ట్ టైం డబ్బులు తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ అప్రూవల్ తెలుపుతారు. 9(1), 9(3) కింద విత్ డ్రాయల్‌ వివరాలని చెప్పాలి. వ్యక్తి సైన్ చెయ్యాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version