ఆయుర్వేదాన్ని నమ్ముకుంటున్న సమంత.. కారణం..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్న ఈమె ఇటీవల యశోద సినిమా ప్రమోషన్స్ కంటే ముందు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన వ్యాధి గురించి పంచుకుంది. అయితే ఇదే విషయంపై సమంత కొద్ది రోజులపాటు విదేశాలలో ఉండడంతో ఆమె ఆరోగ్యం పట్ల అనేక రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవాలని తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపింది. మరొకవైపు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆమె నటించిన యశోద సినిమా కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే.

ఒకపక్క హాస్పిటల్ లో సెలైన్స్ ఎక్కించుకుంటూనే .. ఆమె యశోద సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసింది.. అయితే సమంత మయోసిటీస్ వ్యాధితో థర్డ్ స్టేజ్ లో ఉన్నట్లు ఇటీవల నటి కల్పిక గణేష్ కూడా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఈమె కండిషన్ క్రిటికల్ కావడంతో మళ్లీ ఇమీడియేట్ గా హైదరాబాదులోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు వార్తలు వినిపించాయి.ఈ వార్తలపై సమంత మేనేజర్ స్పందిస్తూ.. అందులో నిజం లేదు.. సమంత గారికి ఏమీ అవలేదు.. ఆమె క్షేమంగా ఇంట్లోనే ఉన్నారు.. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోంది అంటూ ఇలా గాలి వార్తలు ప్రచారం చేయవద్దు అంటూ తెలిపారు.

ఇదిలా ఉండగా సమంత ఇంగ్లీష్ మెడిసిన్స్ ను మానేసి ట్రీట్మెంట్ ని పూర్తిగా మార్చుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం చేయించుకుంటుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కాగా ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం ఆమె హైదరాబాదులో ఉండే లోకల్ ఆయుర్వేదిక్ డాక్టర్ ను సంప్రదించినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version