షాకింగ్‌ : బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పై సమంత కేసు !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత…. ఇటీవలే అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల… నాగ చైతన్య కు విడాకులు ఇస్తున్నట్లు సమంత తెలిపింది. అయితే.. విడాకులపై ప్రకటన చేసిన అనంతరం.. సమంతకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సమంత… ఓ హాలీవుడ్‌ సినిమా ఛాన్స్‌ కూడా కొట్టేసింది. అలాగే ఇటీవలే రిలీజ్‌ అయిన పుష్ఫ సినిమాలో ఐటెం సాంగ్‌ కూడా చేసింది.

ఈ సాంగ్‌ తో సమంత క్రేజ్‌ మరింత పెరిగింది. అయితే.. తాజాగా సమంత కుర్‌ కురే యాడ్‌ లో నటించింది. ఈ యాడ్‌ లో సమంత తో పాటు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించాడు. కాసేటి క్రితమే.. ఈ యాడ్‌ రిలీజ్‌ అయింది. అయితే.. ఈ యాడ్‌ లో అక్షయ్‌ కుమార్‌ సమంత ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అయితే.. అది గమనించిన సమంత.. అక్షయ్‌ కుమార్‌ కు కుర్‌ కురే తినిపిస్తుంది. దీంతో అక్షయ్‌ అక్కడే రిలాక్స్‌ అవుతాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు అక్షయ్‌ కుమార్‌ ను పట్టిస్తుంది సమంత. ఈ యాడ్‌ ను తాజాగా సమంత తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ యాడ్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version