నటి సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు సమంత చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చి తర్వాత వరుసగా సినిమాలు చేసింది. సమంత పల్లెటూరు అమ్మాయిగా సిటీ గర్ల్ గా ఎలా అయినా సరే సమంత అందరిని మెప్పిస్తూ ఉంటుంది.

సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నా క్యారెక్టర్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని నా క్యారెక్టర్ పట్ల అనుమానం వ్యక్తం చేశారు అని సామ్ అన్నారు. సమంతని పల్లెటూరు అమ్మాయిగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని మేకర్స్ ఆందోళన చెందారని, క్యారెక్టర్ గురించి రకరకాలుగా జనం మాట్లాడుకున్నారని సమంత అన్నారు. రామలక్ష్మి పాత్ర గురించి ఇలా చెప్తూ ఏది ఏమైనా నాకు మంచి గుర్తింపునిచ్చిందని సమంత అన్నారు.