Samantha : భారీ పెట్టుబ‌డితో స‌మంత కొత్త వ్యాపారం..!

-

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సమంత. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉంది సమంత.

హీరోయిన్ గా కాకుండా అనే వ్యాపారవేత్తగా కూడా సమంత రాణిస్తోంది. తాను హీరోయిన్గా సంపాదించిన డబ్బులను వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతోంది సామ్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామ్యం చేరింది. స సస్టెయిన్ కార్ట్ అనే స్టార్ట్ అప్ కంపెనీ లో సమంత పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీకి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుంది.

గత సంవత్సరం జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణ రహిత వస్తువులను అమ్ముతారు. దుస్తులు ఇంటీరియల్ డెకరేషన్ నుంచి హెల్త్ ప్రాజెక్టులు సౌందర్య ఉత్పత్తులు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులను ఇందులో ఉంచారు. ఇందులో ఉన్న అన్ని వస్తువులు పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి ఉత్పత్తి కావడం గమనార్హం. పర్యావరణంపై సమంతకు ఎంతో శ్రద్ధ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సమంత నిర్ణయం తీసుకుంది. కాగా సమంత తాజాగా చేసిన యశోద సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version