గూగుల్‌లో కావాల్సిన ఫోటోలు కనపడడం లేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలం లో టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యిపోయింది. అయితే ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ లో వెతుకొచ్చు. అయితే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ లో చాలా మంది తమకు కావాల్సిన ఇమేజెస్ దొరకడం లేదని అనుకుంటున్నారు.

 

Google

అందుకని వారి కోసం కొన్ని కొత్త పద్దతులను గూగుల్ కొత్త వాటిని తీసుకొచ్చింది. వీటిని అనుసరించడం ద్వారా యూజర్లు తమకు కావాల్సిన ఇమేజ్‌ను హై క్వాలిటీలో డౌన్​లోడ్ చెయ్యడానికి అవుతుంది. గూగుల్‌ సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఇమేజ్ వస్తుంది. ఇలా ఇమేజెస్ దొరకనప్పుడు గూగుల్ అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా కూడా ఫోటో పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

దీని కోసం బ్రౌజర్‌లో https://images.google.com/ అని టైప్ చేయండి.
నెక్స్ట్ వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమవైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేసేయండి.
కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి కానీ అప్లోడ్ చేసి కానీ ఫోటో అప్లోడ్ చేసేయండి.
మీకు కావాల్సిన ఇమేజ్ ఇప్పుడు వస్తుంది.
ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ ని ఎంచుకుంటే ఫోటోలు కనపడుతుంది.
ఇమేజ్‌ను గూగుల్ ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా కావాల్సిన ఇమేజ్ ని సెర్చ్ చెయ్యచ్చు.

అదే రివర్స్ ఇమేజ్ కోసం ఇలా చెయ్యండి:

స్మార్ట్ ఫోన్‌లో రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్‌ను ఇలా మనం సెలెక్ట్ చెయ్యచ్చు.
ఫోన్‌లో గూగుల్ యాప్ ఉంటే సరిపోతుంది.
సెర్చ్ లో కెమెరా ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయి పిక్చర్ తీసుకోవాలా అన్న ఆప్షన్ ఉంటుంది.
కెమెరా నుంచి మీరు ఫొటో తీయొచ్చు లేదా మీ ఫోన్‌లోని ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు.
విండో కింది భాగంలో ఎడమ వైపున ఉండేసెలక్ట్ యాన్ ఇమేజ్ అనే ఆప్షన్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే ఫొటోస్ వస్తాయి. డౌన్ లోడ్ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version