ఆదివారం సోషల్ మీడియాలో సమంతే ట్రెండి౦గ్, ఎందుకంటే…!

-

అక్కినేని వారి కోడలు సమంత కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తుందో ఏమో తెలియదు గాని తన క్రేజ్ ని విపరీతంగా క్యాష్ చేసుకుంటుంది ఈ కేరళ అమ్మాయి. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాతో చెలరేగిపోతుంది. విభిన్న కథలతో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ తన మార్క్ చూపిస్తుంది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామకు ఫ్యామిలీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. దీనితో ఆమె ఫ్యామిలీ సపోర్ట్ తో పెళ్లి తర్వాత మరింత దూకుడుగా వెళ్తుంది. ఇప్పుడు దాదాపు నాలుగు సినిమాల్లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.

తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సమంతా చీర కట్టులో దుమ్ము రేపింది. లైట్ పింక్ కలర్ చీరలో కుర్ర కారు మతిపోగోడుతుంది ఈ అక్కినేని వారి కోడలు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కొంత మంది ఆమెను చూసి సాం నీకు పెళ్లి అయిందా…? అంటూ కామెంట్ చేయడం విశేషం. అటు తమిళం సోషల్ మీడియాలో కూడా సమంతానే ట్రెండ్ అవుతుంది.

https://www.instagram.com/samantharuthprabhuoffl/?utm_source=ig_embed

Read more RELATED
Recommended to you

Exit mobile version