చైతన్య – సమంత తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్ స్టాఫ్ పెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడిచిన సంగతి తెలిసిందే! అయితే ఆ హాట్ టాపిక్ కు శనివారం నాడు ఫుల్ స్టాప్ పడింది. సోషల్ మీడియా ప్రచారాన్నే ఫైనల్ చేస్తూ.. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య… సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసేశారు. సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఇప్పుదు “సమంత భరణం” సోషల్ మీడియాను షేక్ చేస్తుంది!
విడాకుల విషయంలో విచారం వ్యక్తం చేసిన నాగార్జున కూడా భరణం ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారనేది మరోగాసిప్. అయితే… సమంత మాత్రం అందుకు అంగీకరించడం లేదంట! అవును… అక్కినేని ఫ్యామిలీ భరణాన్ని ఇవ్వడానికి సిద్ధమైనా.. సమంత మాత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు ప్రచారం జరుగుతుంది!
కాగా.. గతంలో సెలబ్రిటీ కపుల్స్ ఎందరో విడాకులు తీసుకున్నప్పటికీ… భరణం టాపిక్ మాత్రం ఇప్పటివరకూ బయటకు వచ్చిన దాఖలాలు లేవు! రేణూ దేశాయ్ అయితే.. తానేమీ తీసుకోలేదు – పవన్ నే అడగండి అంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు! సో… చైతన్య, సమంతల వ్యవహారం కూడా బయటకు అఫీషియల్ గా రాకపోవచ్చనే అనుకోవాలి!