ప్ర‌భాస్ పుట్టిన‌రోజుకి సమంత షాకింగ్ గిఫ్ట్‌

-

అక్టోబ‌ర్ 23 డార్లింగ్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ప్రకటన రేపు ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ మూవీ టైటిల్ పై ఇంకా క్లారిటీ రాకుండానే సమంత ఆ టైటిల్ కు చిన్న మార్పులు చేసి కబ్జ చేసిందా అంటూ సందేహాలు కలుగుతున్నాయి.

ప్రభాస్ రాథాకృష్ణుల మూవీకి ‘జాన్’ అన్న టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు సమంత శర్వానంద్ తో కలిసి నటిస్తున్న ’96’ మూవీ రీమేక్ కు ‘జాను’ అన్న టైటిల్ ఫిక్స్ చేసి ఇప్పుడు రిజిస్టర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలే నిజం అయితే ప్రభాస్ లేటెస్ట్ మూవీ టైటిల్ పరిస్థితి ఏమిటి అంటూ ప్రభాస్ అభిమానులు గందరగోళం పడుతున్నారు. వాస్తవానికి సమంత అందరి టాప్ హీరోలతో నటించినా ప్రభాస్ తో ఆమె ఇంత వరకు ఎప్పుడు నటించలేదు. ప్రభాస్ తో తనకు నటించాలనే కోరిక ఉంది అంటూ ఆమె ఓపెన్ గా చెప్పినా ప్రభాస్ పట్టించుకోలేదు అని అంటారు. దీనితో ఈ కోపాన్ని మనసులో పెట్టుకుని సమంత ప్రభాస్ టైటిల్ ను కబ్జా చేసి ప్రభాస్ కు ఊహించని ‘పుట్టినరోజు గిఫ్ట్’ ఇచ్చిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version