SAMANTHA : ఈ నెల 23న నల్గొండ జిల్లాకు హీరోయిన్ సమంత

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ సమంత.. నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 23వ తేదీన నల్గొండ జిల్లాలో హీరోయిన్ సమంత పర్యటించనున్నారు. మాంగల్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ నల్గొండ జిల్లాలో 23వ తేదీన జరుగనుంది.

అయితే ఈ కార్యక్రమo సమంత చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే సమంత నల్గొండ రానున్నారు. ఇక ఈ నల్గొండ జిల్లా పర్యటనలో ఫ్యాన్స్… తనను కలుసుకోవచ్చు అంటూ సమంత వీడియో ద్వారా తెలిపారు. ఇక సమంత నల్గొండ వస్తున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

కాగా.. సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది. అటు వరుస సినిమాలు చేస్తూనే ఉంది సామ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version